ఎర్రకోట పేలుడు కేసు: 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడకం, ఉమర్ నబీ పాత్ర
ఢిల్లీలోని ప్రముఖ చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) పరిసరాల్లో సంభవించిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, భద్రతా, దర్యాప్తు సంస్థల వర్గాలు తాజాగా కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించాయి.